నవతెలంగాణ-హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బేస్‌మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు రూ.లక్ష, శ్లాబ్ వేశాక రూ.2 లక్షలు, చివర్లో రూ.లక్ష చొప్పున 4 విడతల్లో రూ.5 లక్షలిస్తున్నారు. ఇక నుంచి శ్లాబ్ వేశాక రూ.1.40 లక్షలే ఖాతాలో జమ అవుతాయని మంత్రి చెప్పారు. మిగతా రూ.60 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇస్తామన్నారు.
The post ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో మార్పులు appeared first on Navatelangana.
Leave A Comment