• Login / Register
  • Site Logo

    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా...

    బిజినెస్
    బంగారం స్వచ్చతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ
    బంగారం స్వచ్చత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24
    carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్చమైన బంగారమన్నమాట. ఇది
    కాయిన్స్‌ (Gold Coins), బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.

    నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్చతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు.
    ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ
    22 క్యారెట్లు/916 స్వచ్చతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను
    91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది.

    బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి
    అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా
    అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున
    డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం
    చూపుతుంది.

    కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల
    ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. 
    Download Main Image

    Leave A Comment