• Login / Register
  • Site Logo

    ఏపీ ఆర్థిక వృద్ధి కొత్త శిఖరాలకు

    ఆంధ్ర ప్రదేశ్

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో రాష్ట్ర GDP వృద్ధి రేటు 10.5% గా నమోదైంది. ఈ వృద్ధి దేశీయ సగటును మించి ఉండటంతో ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షించింది.

    రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఫిషరీస్, పరిశ్రమలు, సర్వీసులు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా మైనింగ్ & క్యువార్రీంగ్‌ రంగంలో అత్యధిక వృద్ధి కనిపించింది. కొన్ని జిల్లాలలో ఈ రంగంలో అసాధారణంగా అభివృద్ధి జరగడంతో మొత్తం రాష్ట్ర వృద్ధికి బలమైన తోడ్పాటు లభించింది.

    ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, సహజ వనరుల వినియోగం, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలు ఈ వృద్ధికి దోహదం చేసిన ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వృద్ధి గణాంకాలను రాష్ట్రానికి ఒక “ఆర్థిక మైలురాయి”గా పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


    Download Main Image

    Leave A Comment