"రిటైర్మెంట్ గురించి కోహ్లితో మాట్లాడా. అతడు నిర్ణయాన్ని ప్రకటించడానికి వారం రోజుల ముందు అనుకుంటా. ఆటకు ఇవ్వగలిగినంత ఇచ్చానన్న స్పష్టతతో అతడు ఉన్నాడు. కోహ్లిలో ఎలాంటి విచారం లేదు" అని అన్నాడు. "విరాట్ నన్ను ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే అతడిలో మరో రెండు మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడగలిగే సత్తా ఉందని అనుకున్నా. కానీ అతడు శారీరకంగా ఫిట్గా ఉన్నా.. మానసికంగా బాగా అలసిపోయాడు" అని రవిశాస్త్రి చెప్పాడు. "సాధారణంగా ఓ ఆటగాడు తన పని పూర్తి చేసి ప్రశాంతంగా ఉంటాడు. కోహ్లి మాత్రం జట్టు బరిలోకి దిగినప్పుడు.. అన్ని వికెట్లు తానే తీసుకోవాలి, అన్ని క్యాచ్లు తానే పట్టాలి. అన్ని నిర్ణయాలు తానే తీసుకోవాలి అన్నట్లు ఉంటాడు. ఆట తీవ్రత ఆ స్థాయిలో ఉంటే, విశ్రాంతి తీసుకోకపోతే మానసికంగా అలసిపోక తప్పదు" అని అన్నాడు. కోహ్లి ఇంకా సాధించాల్సిందేమీ లేదని శాస్త్రి చెప్పాడు.
Leave A Comment