• Login / Register
  • Site Logo

    నవంబరులో భారత మార్కెట్లోకి నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు

    టెక్

    స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ నవంబరులో మరింత సందడి కానుంది. ప్రముఖ బ్రాండ్లు రియల్‌మీ, లావా, వన్‌ప్లస్, ఐకూ తమ తాజా ఫ్లాగ్‌షిప్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. Realme GT 8 Pro, Lava Agni 4, OnePlus 15, iQOO 15 వంటి మోడళ్లు ఈ నెలలో లాంచ్ కానున్న ప్రధాన ఫోన్లుగా గుర్తించబడ్డాయి.

    ఈ ఫోన్లలో 7,000mAh భారీ బ్యాటరీ, తదుపరి తరం Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, హై-రిఫ్రెష్‌రేట్ AMOLED డిస్ప్లేలు, మెరుగైన కెమెరా సెటప్స్ వంటి పాప్ ఫీచర్లు అందించనున్నట్లు సంస్థలు వెల్లడిస్తున్నాయి.

    నవంబరు ఫెస్టివ్ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ లాంచ్‌లు జరగడం, వినియోగదారులకు మరిన్ని ప్రీమియం ఆప్షన్లు లభించనున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

    Download Main Image

    Leave A Comment