నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న ఐశ్వర్య – నర్సినాయుడు దంపతుల ఐదేళ్ల కుమారుడు హర్షవర్ధన్ లిఫ్ట్ వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్నాడు. లిఫ్ట్ ఐదో అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లి ఆగడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని అపార్ట్మెంట్ వాసులు గుర్తించి బయటకు తీశారు. సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.
The post లిఫ్ట్లో ఇరుక్కుని బాలుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment