• Login / Register
  • Site Logo

    లారీని ఢీకొన్న అంబులెన్స్.. రోగులకు తీవ్రగాయాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆటోనగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్‌ ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు ఇద్దరు రోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

    The post లారీని ఢీకొన్న అంబులెన్స్‌.. రోగులకు తీవ్రగాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment