నవతెలంగాణ – జన్నారంజన్నారం మండలంలోని రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారానే యూరియా పొందాలని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య సూచించారు. జన్నారంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. పారదర్శకమైన పంపిణీ కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చిందన్నారు. యాప్లో బుకింగ్ చేసుకున్న తర్వాతే దుకాణాలకు రావాలని, అక్కడ డీలర్లకు బుకింగ్ ఐడీ చూపించి యూరియా తీసుకోవాలని ఆమె రైతులకు వివరించారు. యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
The post యాప్ ద్వారానే యూరియా అందజేత appeared first on Navatelangana.
Leave A Comment