నవతెలంగాణ మద్నూర్: మండలం పెద్ద తడ్గూర్ గ్రామంలో బుధవారం ఉదయం రంజాన్ తోఫాలను ముస్లిం మహిళలకు సర్పంచ్ శాంతాబాయి ఈరన్న అందజేశారు. ఈ సందర్భంగా శాంతవ్వ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హనుమ గౌడ్, కారోబారి మారుతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
The post పెద్దతడుగూర్ సర్పంచ్ శాంతాబాయి రంజాన్ తోఫా పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment