విశాఖపట్నంలో ఇటీవల వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, మరోవైపు అకస్మికంగా మబ్బులు కమ్ముకుని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
నగరంలోని గాజువాక, మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో మధ్యమధ్యలో చినుకులు పడుతుండగా, మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, వచ్చే కొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులు కొనసాగవచ్చని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువసేపు బయట తిరగకూడదని, తగినంత నీరు తీసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో జారుడు రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Leave A Comment