నవతెలంగాణ-జన్నారం: వేసవి కాలంలో సంభవించే అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. జన్నారం మండలంలోని ధర్మారం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణోపాయాలపై అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాలని, తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది చంద్రయ్య శ్రీకాంత్ ఉదయ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి శ్రీనివాసరావు, రచన వసంతా తదితరులు పాల్గొన్నారు.
The post అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు appeared first on Navatelangana.
Leave A Comment