• Login / Register
  • Site Logo

    పాప్ కార్న్ లంగ్

    జీవనశైలి
    పాప్ కార్న్ లంగ్ !

     పాప్ కార్న్ అంటే  .మొక్క జొన్న బొరుగులు 
     తెలుగు రాదు . ఇదొక ఖర్మ 
    లంగ్స్ అంటే ఊపిరి తిత్తులు !
    మరి పాప్ కార్న్ లంగ్స్ అంటే ఏంటి ?

    ఇదొక ప్రాణాంతక వ్యాధి . 

    దీని అసలు పేరు బ్రాంకైటిస్ ఓబిలిటేరన్స్ .

    కొన్ని లక్షల  మంది పిల్లలు నేడు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు . 
    సినిమా థియేటర్ లలో ... మాల్స్ లో..  మైక్రోవేవ్  పాప్ కార్న్   కొన్నారా ?
    దానికి .. బట్టర్ ఫ్లేవర్ { వెన్నె రుచి } ఉంటే పిల్లలు లొట్టలేస్తూ ఎంజాయ్ చేసివుంటారు .
    ఆ వెన్నె రుచి ఎలా వచ్చింది ?అని మనం అడగం .
    ఎవరూ చెప్పరు.
    అదొక కృతిమ రుచి . 
    ఆ రుచి రావడానికి డిఐసిటిల్  రసాయనాన్ని వాడుతారు .
    ఇది ముఖ్యంగా పిల్లల్లో బ్రాంకటైస్ ను కలిగిస్తుంది .
    పాప్  కార్న్ తినడం వల్ల వచ్చింది కాబట్టి డాక్టర్స్ దీనికి పాప్ కార్న్ లంగ్స్ అని పేరు పెట్టారు .

    వ్యాధి వస్తే ఏమవుతుంది ?
    లక్షల్లో ఖర్చు . 
    ప్రాణం   పోవచ్చు .
      ఫ్లేవర్డ్   కాఫీ లో...  కొన్ని రకాల ప్రొసెస్డ్ ఫుడ్స్ లో...  ఇదే డిఎసిటైల్ వాడుతారు .
     ఇది పెద్దల పై తక్కువ ప్రభావం చూపుతుంది . 
    పిల్లలు తట్టుకోలేరు .

    ప్రకృతి ... ఎన్నో రకాల రంగుల్ని రుచుల్ని మనకు అందించింది .    దాన్ని  ఎంజాయ్ చెయ్యడం సహజం .. న్యాయం .
    కృతిమ రంగులు .. కృతిమ రుచులకు మనం  అలవాటు  పడి.. పిల్లల్ని...  అలవాటు చేస్తే ?

    కనీసం...  ఆ కృత్రిమ రంగు...  రుచి ఎలా వచ్చి చచ్చింది ?
    అని తెలుసుకొనే ప్రయత్నం చేయకపోతే ?

     కృతిమ రంగు , కృత్రిమ రుచి .. నీ ఆస్తిని కాజెయ్యడానికి ఫార్మసురుడు...  నీకు ... ముఖ్యంగా...  నీ పిల్లలకు వేసే గాలెం  . 
    చిక్కారా .. చచ్చారే !
    ప్రాణాల మీదకు తెచ్చే మరి కొన్ని కృత్రిమ రంగుల రుచుల వివరాలు ఇవిగో ...
    1 . అస్పర్టమ్ ! 
     డైట్ కోక్..  డైట్ పెప్సీ ..   షుగర్  ఫ్రీ గమ్...  లో క్యాలోరీ డెసెర్ట్ ..  కొన్ని దగ్గు మందులు లో..  వాడుతారు 
    { ముందు  ఇది చెప్పండి .. కప్  సిరప్ దగ్గు దగ్గించుకున్నోళ్ళు ఉన్నారా?}.

    అస్పర్టమ్ వల్ల తలనొప్పి,  ఫిట్స్, ఎలర్జీ , కాన్సర్ వచ్చే ప్రమాదం .

     2    సుక్రాలోస్ !
     బఫెట్ డిన్నర్ లలో..  షుగర్ ఫ్రీ ఐస్ క్రీం...  షుగర్ ఫ్రీ స్వీట్ అనగానే ఎగబడి తింటారు .. చాలామంది . 
    సుక్రాలోస్ వాడడం వల్ల దానికి ఆ తీపి వచ్చింది .
     ఇది   గట్   హెల్త్ ను దెబ్బ తీస్తుంది . 
     డయాబెటిస్  వుంది కదా .. షుగర్ ఫ్రీ తింటే ఏమి కాదు అనుకొంటారు 
    సరిగ్గా అక్కడే ఇది  దెబ్బ   వేస్తుంది . 
    బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పేలా చేస్తుంది .

    3. టార్ట్రజిన్ !
    "మా వాడు మహా చురుకు .. మహా ఆక్టివ్" ..
    ... అని కొంతమంది పేరెంట్స్ మురిసి పోతుంటారు . 
    రోగానికి...  తెలివికి..  తేడా తెలియని అజ్ఞానం అది . 
    నేడు కొన్ని లక్షల మంది పిల్లలలు హైపర్ ఆక్టివిటీ తో . 
    నింపాదిగా 2-3  నిముషాలు కూర్చోలేరు . 
    ఒకే సారి  రెండు మూడు పనులు చేస్తారు . 
     కారణం టార్ట్రజిన్ .
     దీన్ని మౌంటెన్  డ్యూ డ్రింక్స్ లో...  కొన్ని రకాల కాండీస్ లో...  ప్రొసెస్డ్ ఫుడ్స్ లో వాడుతారు .

    4. రెడ్ -40 .:
    ఫాంటా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ లో..  అనేక రకాల కాండీస్ లో...  కాస్మెటిక్స్ లో వాడుతారు . 
    ఇది కూడా హైపర్ ఆక్టివిటీ కి కారణం కావొచ్చు .
     అలాగే కాన్సర్ కు కూడా .

    5. సోడియం నైట్రిట్ 6. BHA !

      ఆహారాన్ని నిల్వ చేయడానికి వాడుతారు . 
    కాన్సర్ కు ... హార్మోన్ సమస్యల కు ఇవి కారణం కావొచ్చు .

    ఇప్పుడు మీరడిగే ప్రశ్న ! 

    ఈ కాలం   పిల్లలు ... పాపకార్న్...  కాండీస్ ... ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా ఎలా బతకాలి ?
    ముందుగా ఒక విషయం తెలుసుకోండి .
    ఈ కాలం పిల్లలు .. ఆ కాలం పిల్లలు  అంటూ..  వేరువేరుగా ఉండరు. వెయ్యేండ్ల క్రితం  పుట్టిన పిల్లయినా...
    ...  మరో వెయ్యేళ్ళ తరువాత పుట్టే పిల్లయినా..  
    శరీర ధర్మాలు ఒక్కటే .
     ఈ సత్యాన్ని  మరిస్తే అధోగతే  . 

    ఇంట్లో పాపకార్న్ చేసి తింటే సమస్య ఉండదు .
     సమస్య...  కృత్రిమ రంగులు .. రుచులు...  ఇంకా ... ఆహారం చెడిపోకుండా వాడే   రసాయనాలతో  .

    రసాయనాలు తింటారా ?
    తింటే బతక గలుగుతారా??

    మీరు .. 
    మీరు కాదు లెండి .. 
    ఈ    "కాలం  పిల్లలకు" కొన్ని సహజ రంగులు రుచులు పరిచయం చెయ్యండి .

    Download Main Image

    Leave A Comment