• Login / Register
  • Site Logo

    Mee పరిశీలనకు

    జీవనశైలి
    మన శరీరంలో కణ విభజనలు సాధారణంగా ఒక క్రమపద్ధతిలో నియంత్రించబడుతుంటాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేకపోవడంతో కణాలు చాలా వేగంగా కంతి అంటారు. ఇంగ్లీషులో ట్యూమర్ అని అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు. క్యాన్సర్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి. క్యాన్సర్‌ మహమ్మారి కోట్లాది రూపాయలను హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నది నమ్మాల్సిన నిజం. పేద, మధ్యతరగతి దేశాల్లోనే మూడింట రెండు వంతుల క్యాన్సర్‌ మరణాలు సంభవిస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

    ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలవరపరిచేది క్యాన్సరే అంటే అది అక్షరసత్యం. ఈ మహమ్మారి రానంతవరకే. వచ్చిందంటే తప్పవు కష్టాలు. అందుకే ప్రజారోగ్యంకోసం దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నా, క్యాన్సర్‌, ఎయిడ్స్‌, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు కోరలు చాస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉంటున్నాయి.  దాంతో ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణంలో మార్పులు సం భవించినప్పుడల్లా ఈ వ్యాధులు ప్రజారోగ్యంపై దాడి చేస్తూనే ఉంటున్నాయి. ఎన్ని వైద్యశాలలు నిర్మించినా, సిబ్బంది సంఖ్యను ఎంతకంతకు  పెంచినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించినా ఈ వ్యాధులను అదుపుచేయడంలో ఎక్కడో అక్కడ వైఫల్యమనేది కనిస్తూనే ఉంటోంది. అవగా హన లోపం, అవినీతి, నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే సత్ఫలితాలు రావడం లేదు.  

    క్యాన్సర్‌ కు సంబంధించిన చికిత్సలో అధునాతనమైన పరికరాలు, పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినా అవి సాధారణ రోగులకు అందుబాటులో లేకపోవడంవల్ల క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దారిద్య్రరేఖకు దిగువనున్న లక్షలాది బడుగువర్గాల కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుబాటులోకి రావడం లేదన్నది ఒప్పుకోవలసిన నిజం. లేదు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఎంత మంది క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారో, మరెందరు ప్రాణాలు కోల్పోతున్నారో తెలీదు.

    ఇంతకూ క్యాన్సర్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్యాన్సర్లలో మాలిగ్నెంట్ ట్యూమర్లలో కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి. ప్రమాదకరము. ప్రాణాంతకమైనవి కూడా. ఇక బినైన్ ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉండి, ఒక పొరతో కప్పబడి స్థానికంగా ఏర్పడుతాయి. ఇవి హానికరమైనవి కావు. వీటిని చినన్న శస్త్ర చికితత్స ద్వారా తొలగించవచ్చును. పుండు మానకపోవడం, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న ట్యూమర్, తగ్గని దగ్గు, బొంగురు గొంతు, మలంలో రక్తం, మలవిసర్జనలో మార్పు, తగ్గని అజీర్తి, మింగటం కష్టతరంగా మారడం, పుట్టుమచ్చలలో మార్పు రావడం వంటివి క్యాన్సర్ కు సూచికలు.

    కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాసనాళాలు తదితర భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కార్సినోమా అనేది ఉపకళా కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ, జనన వ్యవస్థలోని ఉపకళాకణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంథులు నుంచి ఏర్పడతాయి. మన దేహంలో ఏర్పడే కాన్సర్లలో 85 శాతం కార్సినోమా రకానికి చెందినవే. సార్కోమా సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు అవయవాల నుంచి ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు రెండు శాతమే ఉంటాయి.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికేడాది క్యాన్సర్‌ వ్యాధి ప్రబలిపోతున్నాది. సగటున దాదాపు యాభై వేల మంది క్యాన్సర్‌ రోగులు వివిధ రకాల క్యాన్సర్లతో మరణిస్తున్నట్లు అనధికార వర్గాల మాట. రోజంతా కూర్చుని ఉండే జీవనశైలిలో ఊబకాయం, కాలుష్య స్థాయిలు పెరగడం, పొగాకు, ఆల్కహాలు వినియోగం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ క్యాన్సర్ కు కారణాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం క్యాన్సర్‌ వ్యాధులతోపాటు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాది. దేశ వ్యాప్తంగా ఏటా 15 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నప్పటికీ వాటిద్వారా సోకుతున్న వ్యాధుల చికిత్సకు అంతకు పదింతలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. గతంలో పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ పొగాకు వినియోగంవల్లనే ఏటా దాదాపు పది లక్షల మంది యువకులు వ్యాధులపాలై చనిపోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అరవై శాతం క్యాన్సర్‌ మరణాలు పొగాకు కారణంగానే సంభవిస్తున్నాయి. గుజరాత్‌లో అనధికారికంగా గుట్కా తయారీవ్యాపారం, వినియోగం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. దీంతో నోటి క్యాన్సర్‌తో మరణించేవారి సంఖ్య పెరిగిపోతున్నాది. అయితే క్యాన్సర్‌ వ్యాధి సోకిన రోగులు వెంటనే ఆస్పత్రులను సంప్రదించకుండా భరించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడే వైద్యుల దగ్గరికి వెళ్తున్నారని, అప్పటికే వ్యాధి ముదిరి మరణానికి దగ్గరవుతున్నారని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి.  కనుక వ్యాధి ముదిరిన దశలో కాకుండా మొదట్లోనే ఆస్పత్రికి వచ్చేలా రోగుల్లో అవగాహన పెంచడంలో ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తే బాగుంటుందని పలువురి అభిప్రాయం. ఈ వ్యాధులను తగ్గించేందుకు కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ క్యాన్సర్‌, మధుమేహం, గుండెజబ్బులు, పక్షపాతాల నిరోధక నియంత్రణ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడంలేదు కనుక ఇప్పటికైనా క్యాన్సర్‌లాంటి వ్యాధులను నిరోధించడానికి అన్ని కోణాల్లో పరిశీలించి, పరిశోధించి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకుల మాట.

    అవసరం మేరకు సిబ్బంది లేకపోవడం కూడా రోగుల పరిస్థితి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందడం లేదు. ఇక దీనికితోడు వచ్చీరాని వైద్యంతో కొందరు అనర్హులుకూడా చేస్తున్న చికిత్స మరికొందరి ప్రాణాలు తీస్తున్నది. ప్రపంచ ఆరోగ్యసంస్థ 2016లో విడుదల చేసిన నివేదిక ప్రకారం అల్లోపతి వైద్యం చేసేవారిలో 57 శాతానికిపైగా ఎటువంటి విద్యార్హతలు లేవనే విషయం బయటపడింది. అలాగే వైద్యులుగా చెలామణి అవ్ఞతున్న వారిలో 18.8 శాతం మందికి మాత్రమే అర్హత ఉన్నట్టు వెలుగుచూసింది. అలాగే అల్లోపతితోపాటు హోమియో పతి, ఆయుర్వేదం, యూనాని, సిద్ధా యోగా విధానాల్లోని వైద్యులు కలిపి భారతదేశంలో లక్షమంది జనాభాకు కేవ లం ఎనభై మంది మాత్రమే ఉన్నారు.

    వారిలో సంబంధిత పట్టా కలిగిన అర్హులు లక్షకు 36 మంది మాత్రమే. ప్రమా ణాల ప్రకారం వైద్యుల, రోగుల నిష్పత్తి వెయ్యి మందికి ఒక డాక్టరుండాలి. కానీ భారతదేశంలో లక్షా పదహారు వేల డెబ్భై నాలుగు మందికి ఒక డాక్టరు మాత్రమే ఉన్నా రు. ఫలితంగా భారత్‌లో అకాల మరణాలకు చాలావరకు సంక్రామిత వ్యాధులే కారణమవ్ఞతున్నాయి. ప్రపంచ బ్యాం కు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. ఈ విష యంలో దక్షిణాసియాలోనే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు వ్యక్తం చేసింది. అధిక రక్తపోటు, మధుమేహం కారణంగా సోకుతున్న వ్యాధులు భారతీయులపాలిట పెనుశాపంగా మారింది.

    - యామిజాల జగదీశ్
    Download Main Image

    Leave A Comment