• Login / Register
  • Site Logo

    కెనడాలో ఉచిత కిరాణా దుకాణం

    జీవనశైలి

    ----------------------------------
    ఆకలిని తీర్చడం కోసం కెనడాలో ఒక కొత్త మానవతా ప్రయత్నం! అదేంటంటే ఉచితంగా ప్రారంభించిన కిరాణా దుకాణం!!
    ఇది సాధారణ దుకాణం కాదు.
    కెనడాలోని సస్కట్చేవాన్‌లోని రెజీనాలో ప్రారంభించిన మొట్ట మొదటి "ఉచిత కిరాణా దుకాణం" ఇది.

    ఇక్కడికి వచ్చే వ్యక్తులు దేనికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు! 

    ఈ దుకాణం నిజమైన సూపర్ మార్కెట్టులాంటిదే. ఇక్కడ తాజా కూరగాయలు, పండ్లు, బియ్యం, ధాన్యాలు, పాలు, గృహోపకరణాలతో.నిర్వహిస్తున్న దుకాణం ఇది. కానీ...ఇందులో ఉన్న తేడా ఏమిటో తెలుసా?

    ఇక్కడ, మీరు "బిల్లింగ్ కౌంటర్" వద్ద పైసా చెల్లించరు. మీరు దానిని ప్రేమతో తీసుకోవచ్చు.

    ప్రధాన లక్ష్యం :

    ఆకలితో బాధపడుతున్న కుటుంబాలను ఉద్దేశించి నడుస్తున్న దుకాణం. మునుపటిలాగా ముందే
    నింపిన పెట్టెలను అందించడానికి బదులుగా ఇక్కడ వినియోగదారులు తమకు అవసరమైన వాటిని ఎంచుకోవచ్చు.

    ఇది ఆహారం కోసం ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కూడా క్రమబద్ధం చేయడం విశేషం. ఈ దుకాణం వారానికి 5 రోజులు తెరిచి ఉంటుంది.

    ప్రతి ఒక్కరూ తమ స్వంత సమయంలో బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు చేయవచ్చు.

    మొత్తంపై పరిమితి అంటూ ఏమీ లేదు. కానీ ఆర్డర్, సమానత్వం నిర్ధారించబడుతుంది.
    ఇది కేవలం ఆహార దుకాణం కాదు, మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి నిదర్శనం అని రెజీనా ఫుడ్ బ్యాంక్ బృందం చెబుతోంది.

    ఉచితం అంటే విరాళం కాదు, అది ప్రేమ వ్యక్తీకరణ. ఆకలి లేని ప్రపంచం మనకు సాధ్యమే అని చాటడానికి
    ఇలాంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలి అన్నది ఈ బృందం ఆశయం.

    - యామిజాల జగదీశ్



    Download Main Image

    Leave A Comment