న్యూయార్క్, వాషింగ్టన్: భారత్‌సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్‌ను
ఉత్పత్తి చేస్తున్నాయని, రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లూ ఈ
జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి అక్రమ డ్రగ్స్‌ను, అందులో వాడే
రసాయనాలను ఉత్పత్తి/రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా
పరిణమించాయని విమర్శించారు. అమెరికన్ కాంగ్రెస్‌కు సోమవారం సమర్పించిన
‘ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్’ నివేదికలో ట్రంప్ ఈ ఆరోపణలు చేశారు.
భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, ద బహమాస్, బెలీజ్, బొలీవియా,
బర్మా, కొలంబియా, కోస్టారికా, ద డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్
సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో,
నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలు ప్రధానంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి
చేయడంతోపాటు రవాణా చేస్తున్నాయని వివరించారు.
Leave A Comment