• Login / Register
  • Site Logo

    114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన

    హోమ్

    న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో మరో కీలక అడుగు వేయనుంది కేంద్ర ప్రభుత్వం. దేశ రక్షణ సామర్థ్యాలను పెంచేందుకు 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనను సమీక్షకు పంపింది.

    ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఈ విమానాలను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' విధానంలో భాగంగా, దేశీయ తయారీదారులు, విదేశీ కంపెనీలతో భాగస్వామ్యం చేస్తూ ఈ యుద్ధ విమానాల నిర్మాణం జరగనుంది.

    ప్రస్తుతం భారత వైమానిక దళంలో రఫేల్ విమానాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. కొత్తగా 114 ఫైటర్ జెట్లు చేర్చడం వల్ల భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    👉 ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, రక్షణ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు


    Download Main Image

    Leave A Comment