• Login / Register
  • Site Logo

    విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్ల సంతాపం

    హోమ్
    విమాన ప్రమాద ఘటనపై
     క్రికెటర్ల సంతాపం

    స్పోర్ట్స్ డెస్క్: అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటనపై క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రషీద్‌ ఖాన్‌ తమ సంతాపం తెలిపారు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా  బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
    ఈ హృదయ విదారక ఘటనపై టీమ్‌ఇండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ , అఫ్గనిస్థాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ తమ సంతాపాన్ని తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
    Download Main Image

    Leave A Comment