• Login / Register
  • Site Logo

    లంకెలపాలెం జంక్షన్ లో బొగ్గు లారీ బీభత్సం

    హోమ్
    లంకెలపాలెం జంక్షన్ లో బొగ్గు లారీ బీభత్సం

    త్రుటిలో తప్పిన ప్రమాదం


    పరవాడ, విశాఖ సమాచారమ్: జీవీఎంసీ 79 వ వార్డు లంకెలపాలెం జంక్షన్లో బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 సమయంలో డివైడర్ మధ్యలో ఉన్న సిగ్నల్ పోల్ ను  ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో  ఒక ఆటో,  కారు  ప్రమాదానికి గురి అయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ఆక్రమణల వలన ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్ అండ్ బి స్థలాలను ఆక్రమించి చిన్న చిన్న షాపులకు అద్దెలకు ఇచ్చుకోవడం వలన ప్రజలు ఇక్కడ రోడ్లపై ఎండలో మరియు వర్షంలో నిలబడవలసి వస్తుందని వారు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు.
    Download Main Image

    Leave A Comment