• Login / Register
  • Site Logo

    రేపటి నుంచి HYD మెట్రో ఛార్జీల తగ్గింపు Eenadu

    హోమ్
    హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తగ్గించిన మెట్రో ఛార్జీలు శనివారం నుంచి అమలు చేయనున్నారు. సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69. రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గించారు. 2 నుంచి 3 కి.మీ వరకు రూ.18 నుంచి రూ.17కి.. 4 నుంచి 6 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.28కి తగ్గించారు. 6 నుంచి 9 కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.40 నుంచి రూ.37కి తగ్గించారు. (Hyderabad Metro) ఇటీవల హైదరాబాద్‌ మెట్రో ఛార్జీలను పెంచారు. అనంతరం వీటిని తగ్గిస్తూ సవరణ చేశారు. (Telangana News)  

        9 నుంచి 12 కి.మీ వరకు మెట్రో ఛార్జీ రూ.50 నుంచి రూ.47కి తగ్గింపు
        12 నుంచి 15 కి.మీ వరకు రూ.55 నుంచి రూ.51కి తగ్గింపు
        15 నుంచి 18 కి.మీ వరకు రూ.60 నుంచి రూ.56కి తగ్గింపు
        18 నుంచి 21 కి.మీ వరకు రూ.66 నుంచి రూ.61కి తగ్గింపు
        21 నుంచి 24 కి.మీ వరకు రూ.70 నుంచి రూ.65కి తగ్గింపు
        24 కిలోమీటర్లకు పైగా రూ.75 నుంచి రూ.69కి తగ్గింపు
    Download Main Image

    Leave A Comment