• Login / Register
  • Site Logo

    భార్యను చంపి భర్త ఆత్మహత్య

    హోమ్
    భార్యను చంపి భర్త ఆత్మహత్య

    విశాఖలో దారుణం

    విశాఖపట్నం, విశాఖ సమాచారం: రెడ్డి కంచరపాలెంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా పెయింటింగ్‌ పనులు చేస్తున్న నందిగాము గోపీనాథ్‌ నిత్యం మద్యం మత్తులో ఉంటూ భార్య వెంకటలక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడు. గోపీనాథ్‌ భార్య డాబాగార్డెన్స్‌ వద్ద ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన గోపీనాథ్‌ తన ఇద్దరు పిల్లలను బయటకు నెట్టేసి ఇంట్లో ఉన్న డంబెల్స్‌తో భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం గోపీనాథ్‌ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతులకు ఇద్దరు పిల్లలు ఉండగా కుమారుడు రుత్విక్‌ (19) పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. కుమార్తె లక్ష్మీ పద్మ (10) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
    Download Main Image

    Leave A Comment