• Login / Register
  • Site Logo

    ఏఐ వీడియో ద్వారా ఎన్టీఆర్‌ సందేశం

    హోమ్
    ఏఐ వీడియో ద్వారా ఎన్టీఆర్‌ సందేశం

    మహానాడులో టెక్నాలజీ వండర్‌

    కడప, విశాఖ సమాచారం:    సాంకేతికతను అందిపుచ్చుకొని మహానాడు వేదికపై రెండోరోజు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో రూపొందించిన పన్టీఆర్‌ వీడియోను ప్రదర్శించడం ఆకట్టుకుంది. కడప జిల్లాలో రెండో రోజు మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం నందమూరి తారక రామారావు   ప్రసంగాన్ని వేదికపై ప్రదర్శించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు అందులో ఎన్టీఆర్‌ ప్రస్తావించారు. ‘మహా వేడుకలా.. నింగినేలా ఏకమై పరవశించేలా.. అంగరంగ వైభవంగా మహానాడు జరుగుతున్న వేళ పదికోట్ల మంది అన్నదమ్ములకు, ఆడపడుచులకు, రైతన్న లకు, శ్రమజీవులకు.. నా పసుపు జెండాను గుండెలపై మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు.. హృదయపూర్వక నమస్సుమాంజలి..’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేటి యువగళం, పీ4 కార్యక్రమాలను అందులో ఎన్టీఆర్‌ మాట్లాడినట్లుగా ప్రస్తావించారు. నా మనవడు లోకేశ్‌ అంటూ ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ వీడియోను ప్రదర్శించిన అనంతరం రూపకర్తలను చంద్రబాబు   అభినందించారు. ప్రతి ఒక్కరూ ఏఐ టెక్నాలజీని   అందిపుచ్చుకోవాలన్నారు.
    Download Main Image

    Leave A Comment