అమెరికా : షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) తర్వాత భారత్ పై ట్రంప్ కార్యవర్గం అక్కను మరింత పెరిగిపోయింది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ఎస్సీవో సదస్సు మొత్తం నాటకీయంగా ఉందని అభివర్ణించారు. ఆయన ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు. ఆ చర్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎగదోసేలా ఉన్నాయన్నారు. ఎస్సీవో సదస్సు సుదీర్ఘంగా జరిగినా.. నాటకీయంగా ఉందని పేర్కొన్నారు.
ఏది ఏమైనా భారత్ మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్యమన్నారు. దాని విలువలు మాకు దగ్గరగా ఉంటాయి గానీ, చైనా, రష్యా లకు కాదన్నారు. చైనా, భారత్లు రష్యా యుద్ధానికి 200 చేకూరుస్తుండటం వల్లే తాము, మిత్ర దేశాలు రంగంలోకి దిగామని బెసెంట్ పేర్కొన్నారు. భారత్-అమెరికా బంధం బలమైన పునాదులపై ఉందన్నారు. ఇరుదేశాలు అభిప్రాయ భేదాలను పరిష్కరించుకొనే సత్తా ఉన్నవేనని అన్నారు. అదే సమయంలో భారత్పై ఆంక్షలకు వాణిజ్య చర్చలు మందకొడిగా సాగడం కూడా ఓ కారణమని పేర్కొన్నారు. రష్యాపై చర్యలకు అన్ని ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు బెసెంట్ పేర్కొన్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ముగిసిన కొన్ని గంటల సమయంలోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. భారత్లో వాణిజ్యం పూర్తిగా ఏకపక్షంగా ఎంత చేసినా.. చివరికి భారత్ మాతోనే..: అమెరికా ఉందని పేర్కొన్నారు. అధిక సుంకాల కారణంగా భారత్కు అమెరికా వస్తువులను విక్రయించలేకపోతోందని ఆరోపించారు. భారత్ జీరో టారిఫ్ లకు అంగీకరించినా.. అప్పటికే సమయం చేదాటిపోయిందన్నారు.
భారత్కు సమయం మించిపోయింది
ట్రంప్ కార్యవర్గం మొత్తం భారత్పై ఆంక్షలకు రష్యా చమురు, వాణిజ్య చర్చలను కారణాలుగా చెబుతుంటే.. ప్రత్యర్థులు మాత్రం ట్రంప్ స్వార్థంతో న్యూదిల్లీని దూరం చేసుకొన్నట్లు చెబుతున్నారు. ఆయన నోబెల్ బహుమతి పొందేందుకు భారత్ సహకరించలేదన్న అక్కసే కారణమని కొందరు అంటున్నారు. తాజాగా అమెరికా మాజీ ఎన్ఎస్ఏ జాక్ సులేవాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్తో కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం.. భారత్ తో స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు వదులుకొన్నారని చెప్పారు.
అది సిగ్గుచేటు..
ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై తన నోటికి పనిచెప్పారు. అతిపెద్ద నియంతలతో కలిసి ప్రధాని మోదీ వేదిక పంచుకోవడం సిగ్గు చేటన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ భారత్ ఐరోపా, ఉక్రెయిన్తో కలిసి పనిచేయాలని.. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయాలన్నారు. శాంతికి మార్గం అన్నివైపుల నుంచి వెళుతుందని.. దానిలో న్యూదిల్లీ నుంచి కూడా అని పేర్కొన్నారు.
Leave A Comment