విశాఖపట్నం:
విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఆఫర్‌ను ప్రకటించింది. కాపులుప్పాడలో కొత్త లేఅవుట్ ప్లాట్లను విడుదల చేస్తూ, గజానికి కేవలం రూ. 23,500 మాత్రమే ధర నిర్ణయించింది.
ఈ ఆఫర్‌లో ప్రత్యేకత ఏమిటంటే, మొదటి 20 దరఖాస్తుదారులకు వేలం ప్రక్రియ లేకుండా వారికి కావలసిన పరిమాణంలోనే ప్లాట్లు కేటాయించనున్నారు. దీనివల్ల ప్రారంభ దరఖాస్తుదారులు తక్కువ ధరకు నేరుగా లాభపడే అవకాశం పొందుతున్నారు.
రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నది ఏమిటంటే, విశాఖలో పెరుగుతున్న ఆర్థిక అవకాశాలు, నగర విస్తరణ దృష్ట్యా ఈ ఆఫర్‌పై ప్రజలు ఆసక్తి చూపే అవకాశం ఉందని.
పౌరులు అయితే “VMRDA ఆఫర్ నిజంగా బంపర్. మార్కెట్ రేట్లతో పోలిస్తే ఇది తక్కువే” అని అంటున్నారు.
Leave A Comment