• Login / Register
  • Site Logo

    ప్రజలు సంక్షేమ మే కూటమి ప్రభుత్వం ద్యేయం

    ఆంధ్ర ప్రదేశ్
    .సర్పంచ్ జి పద్మ .. 

     జి మాడుగుల(విశాఖసమాచారం):- 
    దేశం రాష్ట్రప్రజలు అభివృద్ధి సంక్షేమమే ద్యేయం కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్య మంత్రి పవన్కళ్యాణ్ ముందుకు దూసుకుపోతున్నారని వంతల సర్పంచ్ గెమ్మెలి పద్మ అన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం వంతల పంచాయతీ పెద వలసగ్రామం లో సోమవారం నాడు జరిగిన ఆది కర్మయోగి అభియాన్ గ్రామసభలో జి పద్మ మాట్లాడుతూ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని వహిస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి సమిష్టిగా సమర్థవంతంగా దేశాన్ని రాష్ట్రన్ని పరిస్తూ ప్రజా సంక్షేమం సంపూర్ణంగా అందిస్తుందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానం సూపర్ సిక్స్ పథకాలను అన్ని నెరవేర్చరని అన్నారు,అందులో భాగంగా నిరుద్యోగ డిఎస్సీ మొదలుకొని,వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు,ఉచిత గ్యాస్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ చంద్రన్న విద్యా కానుకగా 15 వేల రూపాయలు, అన్నదాత సుఖీభవ ఇరువై వేల రూపాయలు,ఆటో రిక్షా కార్మికులకు 15వేల రూపాయలు ఇలా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చరనిఅన్నారు. ,ఆది కర్మ యోగి అభియాన్ అంటే మనలో ప్రతిష్టత్మకమైన నాయకత్వం ఏర్పడాలని అప్పుడే మనతో పాటు దేశం రాష్టం అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం 2030నాటికీ లక్ష్యంతో ముందుకు సాగుతుందని.కావున ప్రజలు ప్రభుత్వం పథకాలు సద్వినియోగం చేసుకొంటూ, దేశ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు,ఈ కార్యక్రమం లో ఎం పి టి సి కృష్ణ మూర్తి నాయుడు. వెలుగు ఏ పి ఎం ఈశ్వర్ నాయుడు. మాజీ సర్పంచ్ జి కొండబాబు. పిసా కమిటీ కార్యదర్శి చిట్టిబాబు. వార్డు సభ్యులు చిన్న కార్యదర్శి శేఖర్ పాఠశాల హె చ్ ఎం దేవి నాయుడు సచివాలయం సిబ్బంది చిట్టి బాబు. సింహచలం గ్రామస్తులు పాల్గొన్నారు.
    Download Main Image

    Leave A Comment