• Login / Register
  • Site Logo

    తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు వేగవంతం చేయాలి

    ఆంధ్ర ప్రదేశ్
    తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలు వేగవంతం చేయాలి

    జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

    అనకాపల్లి,(విశాఖ సమాచారం బ్యూరో):-మొంథా తుఫాను ప్రభావంతో చోటుచేసుకున్న భారీ వర్షాలు, గాలుల కారణంగా తుఫాను అనంతర పరిణామాలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం చోడవరం మండలంలోని తుఫాను పునరావాస శిబిరాలను పరిశీలించారు.కలెక్టర్ ద్వారకానగర్, బాలాజీ నగర్, రెల్లి వీధి ప్రాంతాలను సందర్శించి, ప్రభావిత ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజల తాగునీరు, విద్యుత్, వైద్యసేవలు, ఆహార పంపిణీ వంటి చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో సరిపడ మౌలిక సదుపాయాలు కల్పించి, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.ఈ సందర్శనలో తహసీల్దార్, మరియు విభాగాధికారులు పాల్గొన్నారు
    Download Main Image

    Leave A Comment