అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవు ఉండనుంది. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను తెదేపా, 9 అంశాలను భాజపా ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
జీఎస్టీ సంస్కరణలపై నేడు శాసనసభలో చర్చ జరుగుతుంది. 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్-6, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ జరగనుంది.
Leave A Comment