• Login / Register
  • Site Logo

    విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

    ఆంధ్ర ప్రదేశ్
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
     
     : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌ 2లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో కేబుల్స్‌, ఇతర యంత్ర పరికరాలు కాలిపోయాయి. దీంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మిషన్‌-2లో ఆయిల్‌ లీకైనట్లు అధికారులు గుర్తించారు. నిప్పురవ్వలు ఆయిల్‌పై పడి కేబుల్‌, మిషనరీ నుంచి మంటలు చెలరేగినట్లు తెలిపారు.    మంటలు భారీగా ఎగసి పడటంతో స్టీల్‌ ప్లాంట్‌ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాద సమయంలో లోపల కార్మికులు ఉన్నారా ?  ప్రమాదం ఎలా జరిగింది? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
     కాగా.. నాలుగు రోజుల క్రితం కూడా స్టీల్‌ ప్లాంట్లో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం బ్లాస్ట్‌ ఫర్నెస్‌ -2లో సుమారు 300 ట్రక్కుల లిక్విడ్‌ స్టీల్‌ నేలపాలయింది. లిక్విడ్‌ స్టీల్‌ ను ఫర్నెస్‌ నుంచి టర్బో ల్యాడిల్‌ కార్‌లోకి నింపి, ఎస్‌ఎంఎస్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ల్యాడిల్‌ కార్‌కు రంధ్రం పడి లిక్విడ్‌ స్టీల్‌ కింద పడగా.. మంటలు చెలరేగి కేబుల్స్‌ కాలి, ట్రాక్‌ దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజుల్లో మళ్లీ అగ్నిప్రమాదం జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
    Download Main Image

    Leave A Comment