5వ తేదీ మదగడ గిరిజన గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఉదయం 8.45 కు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు
రోడ్డు మార్గం ద్వారా 11.30 గంటలకు మదగడ గిరిజన గ్రామం చేరుకుంటారు
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, మదగడ గిరిజన గ్రామాన్ని సందర్శిస్తారు.
మదగడ గ్రామస్తులు నిర్వహించుకునే ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’ లో పాల్గొంటారు.
మదగడ గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రమే 12 రోజులపాటు నిర్వహించే బలి పొరోబ్ ఉత్సవాలు గత నెల 25వ తేదీన ప్రారంభమయ్యాయి.
అల్లూరి జిల్లాతోపాటు మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజు ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు.
ఉదయం 11.30 నుంచి 2 గంటల వరకు గిరిజన పండుగలో పాల్గొంటారు
3 గంటలకు తిరిగి బయలుదేరి 5.40 కి విశాఖ విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయలుదేరుతారు
Leave A Comment