• Login / Register
  • Site Logo

    థియేటర్‌లో ప్రత్యక్ష ప్రసారం

    ఆంధ్ర ప్రదేశ్
    థియేటర్‌లో ప్రత్యక్ష ప్రసారం

     రావివలస గ్రామస్థులతో పవన్‌ ముఖాముఖి

    వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

    టెక్కలి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో గురువారం మాట్లాడారు. ‘మన ఊరు-మాటా మంతి’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైనా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
    Download Main Image

    Leave A Comment