నవతెలంగాణ-మర్రిగూడ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ అన్నారు.సోమవారం గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాారు. త్రాగు నీటితో పాటు,స్థానికంగా వచ్చే వాడుకునే నీటిని సైతం వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. నీటి వినియోగంలో గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నజీరా,వార్డు మెంబర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
The post నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment