• Login / Register
  • Site Logo

    అగి ఉన్న కారును ఢీకొన్న కంటైనర్..ఇద్దరు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని శామీర్ పేట్ ఓఆర్ఆర్ పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ -7 వద్ద ఆపి భోజనం చేస్తున్న వారిపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మౌలాలికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న శామీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.

    The post అగి ఉన్న కారును ఢీకొన్న కంటైనర్..ఇద్దరు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment